SDPT: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఉద్యోగ మిత్ర’ మెగా జాబ్ మేళాకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 25న ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్ తెలిపారు. ఈ జాబ్ మేళా ఏర్పాట్లపై సోమవారం మర్కూక్ పోలీస్ స్టేషన్లో కంపెనీ ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.