MBNR: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి మహబూబ్ నగర్లో ఆర్టీసీ కార్మికుల నిరసనకు మద్దతు తెలిపారు. విపక్షాలు టీజీఆర్టీసీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయని, ఆ మోసగాళ్లను నమ్మవద్దని కార్మికులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థను కాపాడుతుందని భరోసా ఇచ్చారు. ఆర్టీసీని నష్టపరిచే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.