కాకినాడ: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు నుంచి సర్పవరం ఇన్స్‌స్పెక్టర్ రవిని తొలగించారు. కేసు బాధ్యతలను తుని రూరల్ సీఐ చెన్నకేశవకు అప్పగించారు. సర్పవరం స్టేషన్ బాధ్యతలు చేపట్టిన అధికారులపై ఇప్పటివరకు ఐదుగురిపై సస్పెన్షన్ లేదా వీఆర్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ తొలగింపు చర్చనీయాంశమైంది.