AP: డబ్బున్న వ్యక్తులను బురిడీ కొట్టిస్తున్న హనీట్రాప్ ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలు సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు DSP తెలిపారు. ఇప్పటివరకు 20 మంది బాధితుల నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.13 లక్షలు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాతో సంబంధాలున్న ఇద్దరు సీఐలను VRకు అటాచ్ చేసి విచారణ జరుపుతున్నారు.