SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల 25న ‘ఉద్యోగ మిత్ర’ మెగా జాబ్ మేళా జరగనుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమయ్యే ఈ మేళాలో 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.