SRD: జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావును మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదర్శ్ రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మాణిక్యం యాదవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.