NGKL: చారకొండ మండలంలోని జూపల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాములు యాదవ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి గ్రామానికి 50 ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు రాములు యాదవ్ తెలిపారు.