KRNL: పెద్దకడబూరు (మం) బసలదొడ్డి గ్రామంలో ఇవాళ అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో మండల AO సుచరిత, ఉద్యాన అధికారిణి అపర్ణ, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని రైతులకు PMDS విత్తన కిట్లు అందజేశారు. డ్రై సోయింగ్ విధానం ద్వారా భూసారం మెరుగుపడి, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవచ్చని వారు తెలిపారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం పాటించాలన్నారు.