నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదాయ వనరుల సమీకరణపై అధికారులు దృష్టి సారించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం నగరంలోని పలు డివిజన్లలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. డివిజన్ 21, 48లో బకాయి ఉన్న ఆస్తి పన్నులను సమీక్షించి అవగాహన కల్పించారు.