TG: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు INTUC అధ్యక్షుడు రాజిరెడ్డి మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న 2021, 2025 వేతన సవరణలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రకాల బకాయిలను విడుదల చేయడంతో పాటు, డిపోలలో అధికారుల వేధింపులను ఆపాలని సూచించారు. డబుల్ డ్యూటీ చేసే వారికి డబుల్ వేతనం ఇవ్వాలని స్పష్టం చేశారు.