TG: రాష్ట్ర భవిష్యత్తు కేసీఆర్‌తోనే సాధ్యమని BRS ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ఇప్పటికైనా మేడిగడ్డను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డికి కలలో కూడా కేసీఆరే కనిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.