KNR: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు వాహనాలలో పరిమితికి మించి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష అనంతరం అమ్మాయిలు ఆటోల వెనుక భాగంలో ఒకరిపై ఒకరు కూర్చొని ప్రయాణించే వాహనాల దృశ్యాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి.