MLG: మేడారం గద్దెల వద్ద గాయపడ్డ బాలుడు యువన్ను ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, రూ.1 కోటి నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.