MLG: తాడ్వాయి (M) మేడారంలో ఓ చిన్నారిని బైక్‌తో ఢీకొని ఇద్దరు యువకులు పరారైన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లోని CC కెమెరాలను పరిశీలించగా, నిందితులు బైక్‌పై వాటర్ క్యాన్ తీసుకుని వెళ్లిన దృశ్యాలు లభించాయి. ప్రమాదంలో చిన్నారి కాలు విరిగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువకులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేస్తున్నారు.