PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో 36 ఏళ్ల సుదీర్ఘకాలం హోమ్ గార్డ్‌గా సేవలందించి, పదవీ విరమణ పొందుతున్న ఎండీ. షరీఫ్ ఉద్దీన్‌ను అదనపు డీసీపీ కే. శ్రీనివాస్ ఇవాళ ఘనంగా సన్మానించారు. తన చాంబర్లో ఇతర పోలీసు అధికారులతో కలిసి శాలువాతో సన్మానించి, వీడ్కోలు పలికారు. ఏసీపీ నాగేంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.