MDK: తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తూప్రాన్ తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఐకెపి కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. మండలంలో పెద్ద గ్రామమైన ఘనాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.