SRD : జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని దాది గూడెం గ్రామ శివారులో గురువారం ఉదయం జింక ప్రత్యక్షమవడం స్థానికుల్లో ఆసక్తి, ఆందోళన కలిగించింది. గ్రామస్తులు జింకను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎండల కారణంగా నీటి కోసం లేదా ఆహారం కోసం అడవుల నుంచి బయటకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.