BHNG: జిల్లాలో రబిలో సుమారు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్లో సివిల్ సప్లై అధికారులు, అగ్రికల్చర్, కో -ఆపరేటివ్, మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించారు.