HYD: సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోని బౌద్ధ నగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై బస్తీ వాసులను స్వయంగా కలుసుకొని వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డివిజన్లో, బస్తీలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.