RR: మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల కోసం 4 వేలకుపైగా స్లాట్ బుకింగ్స్ నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడం, ఆస్తుల కొనుగోలు విక్రయాలు అధికమవడం దీనికి కారణంగా అధికారులు తెలిపారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం వల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా సేవలు అందుతున్నాయి.