VKB: కొడంగల్లో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేటు వాహనాలు జోరుగా నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కొడంగల్ చుట్టూపక్కల గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ కిరాయిలు తీసుకుంటున్నారు. వేసవికాలం స్కూల్ సెలవులు రావడంతో కొడంగల్ బస్టాండు ప్రజల తాకిడి పెరిగింది.