జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు నిరసన చేపట్టారు. TRP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు కూడా చేయకపోవడం దురదృష్టకరమని, బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపించారని విమర్శించారు.