BDK: రాష్ట్రంలో అత్యంత దీన స్థితిలో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆటో సంఘం రాష్ట్ర నాయకులు వేల్పుల భాస్కర్ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజంలో అందరి జీవితాలు మారుతున్న గాని ఆటో డ్రైవర్ల జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, ఆటో డ్రైవర్లపై ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.