KNR: ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆశా కార్యకర్తలు చేపట్టిన ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేశవపట్నం నుంచి తరలివెళ్తున్న ఆశా కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టయిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పీ. విజయలక్ష్మీ, ప్రధాన కార్య దర్శి లీలాదేవి ఉన్నారు.