BHPL: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాలను విశ్లేషించడానికి రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మే 30వ తేదీలోగా పరీక్షలు పూర్తి చేసి, బ్యారేజ్‌ల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు సిద్ధం చేయాలన్నారు.