MNCL: ప్రభుత్వ పథకాలపై వార్డు సభ్యులు అవగాహన పెంచుకోవాలని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికలలో వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తుందన్నారు.