ADB: ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శనగ పంట కొనుగోలు షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.5,875 గా నిర్ణయించగా, ఎకరానికి 7.20 క్వింటాళ్ల చొప్పున సేకరించనున్నారు. బజార్హత్నూర్ మండల గ్రామాలకు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 27 వరకు తేదీలను ఖరారు చేశారు.