HYD: పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అలాగే విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి రాకపోకలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేవలం గత 40 రోజుల్లోనే ప్రయాణికుల రద్దీ సుమారు 78% వరకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటక రంగానికి ఇది భారీ దెబ్బగా నిపుణుల చెబుతున్నారు.