WNP: పానగల్ PACS పరిధిలో 600 యూరియా బస్తాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని కార్యదర్శి భాస్కర్ గౌడ్ తెలిపారు. రైతులు ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి బుకింగ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. యాప్లో బుక్ చేసుకున్న వారు నేరుగా సొసైటీ గోదాం వద్ద యూరియా పొందవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.