MBNR: జడ్చర్ల పట్టణంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కన్నులపండుగగా జరిగింది. పట్టణ ప్రజలతో కలిసి శోభాయాత్రలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీలో మాజీ మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడిపి, భక్తులతో కలసి నృత్యం చేస్తూ ఉత్సాహం నింపారు.