KMR: రాష్ట్రంలో హత్యలకంటే రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యనే ఎక్కువగా ఉందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.