MHBD: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ‘Arrive – Alive’ రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. బయ్యారం-2 SI మహబూబి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ వేసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, ప్రతి వాహనానికి పొల్యూషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు.