SDPT: పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది బుధవారం సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద “అరైవ్ అలైవ్” కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు, వాహనదారులకు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తేనే ప్రమాదాలు తగ్గించి సురక్షిత రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చని సూచించారు.