AP: కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఓ లైటింగ్ డెకరేషన్ సంస్థ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడటంతో గోదాంలో ఉన్న సుమారు రూ.కోటి విలువైన సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.