KNR: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను సీఈఐఆర్ (CEIR) టెక్నాలజీ సహాయంతో గుర్తించి బాధితురాలికి అప్పగించినట్లు ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు. పారువెల్ల గ్రామానికి చెందిన చెక్కిళ్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోన్ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకుని బాధితురాలి భర్తకు అందజేశారు. ఈ కేసు ఛేదించిన కానిస్టేబుల్ పురాణం సాయి ప్రేమ్ను ఎస్సై ప్రత్యేకంగా అభినందించారు.