TG: హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఆర్కియాలజీ విభాగం సమన్వయంతో ముందుకెళ్తున్నామని, పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. సౌకర్యాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల వద్ద మెరుగైన వసతులు కల్పించేలా చూస్తామని భరోసా కల్పించారు.