IPL 2026 సీజన్లో భాగంగా RCBతో జరిగే మ్యాచ్కు తమ ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అందుబాటులోకి వచ్చాడని LSG డైరెక్టర్ టామ్ మూడీ తెలిపాడు. IPL చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బాల్ వేసిన రికార్డ్ మయాంక్ పేరిట ఉంది. గత IPL సీజన్లో రెండు మ్యాచులు మాత్రమే ఆడిన మయాంక్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడని టామ్ మూడీ పేర్కొన్నాడు.