PDPL: గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డా. టి.శ్రీనివాసరావు హన్మకొండకు బదిలీ కావడంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను నిన్న రాత్రి ఘనంగా సన్మానించారు. ఆయన ధర్మబద్ధంగా తీర్పులిస్తూ ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు సచిన్ రెడ్డి, స్వారిక, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రావు పాల్గొన్నారు.