MLG: ఎండల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఎండ దెబ్బ తాకకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ ఎండలు అధికంగా ఉన్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని, చలివేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.