NLG: నల్గొండ ఎన్జీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చిలుముల సుధాకర్ అరుదైన గౌరవం సాధించారు. ఎన్సీసీలో అసోసియేట్ ఆఫీసర్ సేవలు అందించేందుకు అర్హత సాధించిన ఆయన, లెఫ్టినెంట్ హోదాతో అర్హత పొందారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జనవరి 5 నుంచి ఏప్రిల్ 4 వరకు మూడు నెలల పాటు నిర్వహించిన అత్యంత కఠిన సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.