SDPT: వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. రబీ 2025-26 సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలోని అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలన్నారు.