వనపర్తి పట్టణంలోని ప్రధాన రోడ్ల పక్కన చెత్త కుప్పలు పడి ఉన్నాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. పట్టణ సమీపంలోని గోపాల్ పేట, ఘణపురం, పానగల్, పెబ్బేరు, కొత్తకోట ప్రధాన రోడ్లకు ఇరుపక్కల చెత్తను, మురిగిన కూరగాయలను వేస్తున్నారు. ఆ ప్రాంతాల నుంచి వెళ్లే వాహనదారులు, ప్రజలు దుర్వాసనతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.