MBNR: ప్రముఖ నటుడు, సామాజికవేత్త సోను సూద్‌ను MLA, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు మిథున్ వెల్లడించారు. సామాజిక సేవ కార్యక్రమాలపై ప్రత్యేకంగా సోనుసూద్‌ను అభినందించినట్లు మిథున్ రెడ్డి పేర్కొన్నారు.