WNP: ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణను వేగవంతం చేసి, రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.