JGL: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల్, రాయికల్ పట్టణ కౌన్సిలర్లు ఇవాళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. భోగ శ్రావణి, జగిత్యాల్ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.