PDPL: ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలోని బోయపల్లె వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ భూక్య సంగీత మంగళవారం ప్రారంభించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ సంగీత తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ సామల నాగభూషణం, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.