BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ సర్పంచ్ మర్రి సంధ్యా మల్లారెడ్డి వాహనదారులకు గురువారం పలు కీలకమైన సూచనలు చేశారు. అకస్మాత్తుగా ఊహించకుండా జరిగే రోడ్డు ప్రమాదాలకు హెల్మెట్ ధరించడం వల్ల చాలా వరకు ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదని అన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు.