NLG: నియోజకవర్గాల పునర్విభజనలో నకిరేకల్, తుంగతుర్తి స్థానాలు జనరల్‌గా మారే అవకాశం ఉందన్న ప్రచారంతో నల్గొండ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్ల అంచనాలతో కీలక నేతల భార్యలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వీరేశం భార్య పుష్పారెడ్డి, కిశోర్ భార్య కమల, రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పేర్లు తెరపైకి వస్తున్నాయి.