SRD: జిల్లా దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న స్కూటీలు రెండు నెలలుగా కలెక్టర్ కార్యాలయంలో వృథాగా ఉన్నాయి. ఫిబ్రవరిలో 50 మంది దివ్యాంగుల కోసం దివ్యాంగుల శాఖ స్కూటీలను తెప్పించింది. వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్యాలయంలో మూలకు చేరాయి. ఎంపిక చేసిన దివ్యాంగులకు వెంటనే పంపిణీ చేసేలా చూడాలని పలువురు కోరుతున్నారు.