WGL: రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం-మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరతో కొనుగోలు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.